ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో కీలక మార్పులు

తెలంగాణలో పెద్ద ఎత్తున బోనాలు జరుగుతున్నాయి. ఆషాఢం మొత్తం బోనాల సందడి నెలకొంటుంది. ముఖ్యంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో బోనాల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అతా ముఖ్యమైనవి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జూలై 21,22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. 21న బోనాల జాతర జరగనుంది. ఇక 22న అతి ముఖ్యమైన ఘట్టం.. రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ నెల 21న నిర్వహించనున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలపై అధికారులు మరింత ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఏటా మాదిరిగా కాకుండా ఈ ఏడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల విషయంలో కీలక మార్పులు చేశారు. ఈ సారి ఆలయంలోకి శివసత్తులు, జోగినిలతో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4 గంటల లోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఫలహార బండి (తొట్టెల) ఊరేగింపు విషయంలోనూ ఆంక్షలు విధించారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలహార బండి ఊరేగింపు రాత్రి 12 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Share this post with your friends