కరుంగలి మాల అంటే ఏమిటి? ఇటీవల చాలా మంది ప్రముఖులు ధరించడంతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ మాల అసలు “ఎబోనీ” అనే నల్లని గట్టి చెక్కతో తయారవుతుంది. ముదురు నలుపు రంగులో, బరువుగా ఉండే ఈ చెక్కతో 108 పూసలుగా మాల తయారు చేస్తారు. సంప్రదాయంగా ఇది తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో సంబంధం కలిగి ఉంది. ముఖ్యంగా పూజించి ఇచ్చే కరుంగలి మాలకు ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజదోషం, శని ప్రభావం ఉన్నవారు ధరిస్తే మేలు కలుగుతుందని కలుగుతుందని చెబుతారు. ఆధ్యాత్మికంగా ఇది మూలాధార చక్రాన్ని స్థిరపరచి మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇస్తుందని నమ్మకం. అయితే మార్కెట్లో నకిలీలు ఎక్కువగా ఉండటంతో జాగ్రత్త అవసరం. నిజమైన మాల గట్టిగా, బరువుగా ఉండి సహజమైన వాసన ఇస్తుంది. ధరించే ముందు శుభ్రపరిచి ఆలయంలో పూజ చేయించి “ఓం శరవణభవ” లేదా “ఓం నమఃశివాయ” అనే మంత్ర జపంతో ధరించడం శ్రేయస్కరం. భక్తి, విశ్వాసం ఉంటేనే మాలకు ఫలితం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

