జ్యేష్టమాసంలో ఇక్కడ అమ్మవారు సంచరిస్తారట.. నెల రోజుల పాటు ఉత్సవం..

భీమవరం మావుళ్ళమ్మ గురించి తెలుసా? ప్రతి రోజూ ఒంటినిండా బంగారంతో ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. అ్మమవారు జ్యేష్ట మాసం వచ్చిందంటే చాలు.. భీమవరంలో సంచరిస్తారట. ఇది భక్తుల విశ్వాసం. అందుకే జ్యేష్టమాసం నెల రోజులపాటు వైభవంగా జేష్ఠ మాస జాతర ప్రతియేటా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అమ్మవారిని భీమవరం ప్రజలంతా తమ ఇలవేల్పుగా కొలుచుకుంటారు. ఏడాదిలో రెండు సార్లు అమ్మవారి జాతర నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచి నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ తరువాత జ్యేష్టమాసంలో రెండోసారి ఉత్సవాలు జరగుతాయి.

ఈ ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల తొలి రోజున ఆలయ ప్రధాన అర్చకుడు సహా ఇతర అర్చకులంతా మావూళ్లమ్మను అందంగా అలంకరించి ఆపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి కోసం తయారు చేసిన రథాన్ని పూలతో అందంగా అలంకరిస్తారు. ఆపై ఉత్సవ మూర్తిని రథంపై ఉంచి నగరోత్సవము నిర్వహిస్తారు. ఈ కార్యక్రమమంతా ఓ పండుగలా జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు.

Share this post with your friends