ఏడుస్తున్నట్టు కల వస్తే రెండు అర్థాలు.. అవేంటంటే..

ప్రతి కలకు ఓ అర్థముంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. భవిష్యత్‌లో జరిగే కొన్ని సంఘటనలకు కొన్ని కలలు నిదర్శనమని కూడా చెబుతోంది. కలలు కొన్ని కష్టాలను.. కొన్ని శుభాలను సూచిస్తాయట. కలకు అది ఇది అని ఏమీ ఉండదు. ఏది పడితే అది వస్తుంది. అయితే కలలో కొన్ని సార్లు ఏడుస్తున్నట్టుగా వస్తూ ఉంటుంది. అలా వస్తే ఏంటి అర్థమో తెలియక కలత చెందుతూ ఉంటాం. మనమే కాదు.. ఎవరైనా ఏడుస్తున్నట్టు కనిపించినా కూడా దానికి ఒక ప్రత్యేక అర్థం అనేది ఉంటుందట. అయితే మనం ఏడుస్తున్నట్టు కల వస్తే ఒక అర్థం.. ఇతరులు ఏడుస్తున్నట్టు కల వస్తే మరొక అర్థమట. అదేంటో తెలుసుకుందాం.

కలల శాస్త్రం ప్రకారం కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తే అర్థం మీరు నిండు నూరేళ్లు జీవిస్తారని అర్థమట. మీ జీవితం ఆనందంతో మంచిగా జీవిస్తారని అర్థమట. కలలో ఏడుపు కూడా ఆర్థిక లాభాలతో పాటు.. ఏదైనా అవార్డు అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కలలో బిగ్గరగా ఏడుస్తున్నట్టు కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణించవచ్చు. భవిష్యత్తులో మనకు జరగనున్న మంచికి, అలాగే ఏదైనా పెద్ద మార్పునకు సంకేతంగా కూడా పేర్కొంటారు. ఏదైనా పని అనుకోని ఆటంకాల వలన నిలిచిపోయినట్లయితే.. అది కూడా పూర్తవుతుందట. కలలో ఇతరులు ఏడుస్తున్నట్టు కనిపిస్తే జీవితంలో సమస్యలు ఎదురవుతాయని అర్థమట.

Share this post with your friends