కొంతమందికి ఎంత ప్రయత్నించినా కూడా వివాహం సెట్ అవదు. దీంతో కుటుంబ సభ్యులంతా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఏకాదశి చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించుకుంటాం. ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరుచుకుని.. శ్రీ మహావిష్ణువుని పూజించుకోవాలి. ఈ రోజున చేసే వ్రతం కానీ.. ఉపవాసం కానీ వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుందట. ఈ రోజున ఉపవాసం చేస్తే భక్తుల ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుందట. ఇక వివాహ ప్రయత్నాలు ఫలించకున్నా కూడా యువతీ యువకులు ఏకాదశి రోజున ఓ పని చేయాలని పండితులు సూచిస్తున్నారు.
అదేంటంటే.. ఏకాదశి రోజున యువతీ యువకులు రుక్మిణి కల్యాణాన్ని 11 సార్లు చదివితే ఫలితం ఉంటుందని.. నెల తిరిగే సరికి వివాహం కుదురుతుందట. అలాగే దంపతుల మధ్య సమస్యలున్నా కూడా తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే వివాదాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారట. సత్యనారాయణ స్వామి వ్రతంతో తెలిసీ తెలియక చేసే పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందట. ఈ రోజున అన్నదానం చేసినా కూడా శ్రీమన్నారాయణుని కరుణతో జీవితంలో మనకు భోజనానికి లోటుండదట. అలాగే ఈ రోజున నెమలి పింఛాన్ని పూజించి దానిని డబ్బులు పెట్టే లాకర్‌లో పెట్టుకుంటే జీవితంలో డబ్బుకు లోటుండదట.