మౌని అమావాస్య ఎప్పుడనేది తెలుసుకున్నాం కదా. ఆ రోజున నదీస్నానం, దానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈసారి మౌని అమావాస్య నాడు మహాకుంభమేళ నడుస్తుంటుంది కాబట్టి ఇక్కడ స్నానమాచరిస్తే మరింత ఫలితం లభిస్తుంది. ఈ మౌని అమావాస్యనాడు నిర్వహించే మూడో రాజస్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉందని తెలుసుకున్నాం కదా. జనవరి 29న పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా లేదంటే చొల్లంగి అమావాస్యగా జరుపుకుంటారు. ఈ రాజ స్నానం చేసే శుభ సమయం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.25 నుంచి సాయంత్రం 6:18 గంటల వరకు ఉంటుంది.
వాస్తవానికి ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. వాటిలో పుష్య బహుళ అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కుంభమేళా, మౌని అమావాస్యల కలయిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున చేసే నదీస్నానం.. శ్రాద్ధం వంటి కర్మలతో పూర్వీకుల అనుగ్రహంతో పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. రాజస్నానం చేసేవారు ముందుగా నదీమతల్లికి నమస్కారం చేసుకుని ఒడ్డున మట్టిని కొంత తీసుకుని నదిలో కలిపి ముందుగా ముక్కు మూసుకుని నీటిలో మూడు సార్లు మనగాలి. అనంతరం దోసిలితో నీటిని తీసుకుని సూర్యునికి అర్థ్యం ఇచ్చి బయటకు రావాలి. నదిలో పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి నదిలో దీపం వదిలాలి. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వంశాభివృద్ది కలుగుతుందట.