శని బాధ నుంచి మనుషులకు పిప్పిలాదుడు ఎలా విముక్తి కల్పించాడంటే..

సంస్కృతంలో రావి చెట్టును పిప్పల వృక్షం అంటారు కాబట్టి బాలుడికి నారదుడు పిప్పలాదుడు అని నామకరణం చేశాడు. ఆ తరువాత శని బాధలను తొలగించడం కోసం పిప్పలాదునికి నారదుడు దీక్ష ఇచ్చి, తపస్సు చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. నారదుడు చెప్పిన విధంగానే పిప్పిలాదుడు బ్రహ్మ దేవుడి కోసం కఠోర దీక్ష చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అడగ్గా తన కళ్లకు దేనినైనా దహించే శక్తిని ఇవ్వమని కోరుకున్నాడు. బ్రహ్మ వరం ఇచ్చేశాడు. అప్పటి నుంచి పిప్పిలాదుడు తన కంటి చూపుతోనే అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.

తన తండ్రి దధీచి అకాల మరణానికి కారణమైన శని దేవుడిని కూడా తన కంటి చూపుతో దహించివేశాడు. దీంతో విశ్వంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిదేవుడిని రక్షించేందుకు దేవతలంతా విఫల యత్నం చేసినా కూడా సాధ్యపడలేదు. కళ్ల ముందు దహించుకుపోతున్న కొడుకుని చూసి రక్షించమంటూ బ్రహ్మదేవుడిని సూర్యుడు ప్రాధేయపడ్డాడు. చివరకు బ్రహ్మ దేవుడు పిప్పిలాదుడి ముందు ప్రత్యక్షమై శని దేవుడిని విడిచి పెట్టమని కోరాడు. కానీ పిప్పిలాదుడు అంగీకరించలేదు. దీంతో పిప్పిలాదుడికి శని దేవుడిని విడిచి పెడితే రెండు వరాలు ఇస్తానని బ్రహ్మ చెప్పాడు. దీనికి సంతోషించిన పిప్పిలాదుడు మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకూ ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదని కోరుకున్నాడు. రెండో వరంగా తనకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టుకు సూర్యోదయానికి ముందు నీరు సమర్పించిన వారికి శని మహాదశ బాధ ఉండకూడదని రెండవ వరం కోరుకున్నాడు.

Share this post with your friends