జ్యోతిష్యంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తూ ఉంటాం. బృహస్పతి ఏడాదికోసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం గురువు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గత నెలలో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఆగస్ట్ చివరి వారం వరకూ వృషభ రాశిలోనే సంచరినున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసొస్తుంది. ఆర్థికంగానూ.. వ్యక్తిగతంగానూ అన్ని విధులుగా బాగుంటుంది. ఇక ఏ ఏ రాశుల వారికి బాగుంటుందో చూద్దాం.
వృషభ రాశి : గురువు రోహిణి నక్షత్రంలో సంచరించడంతో పాటు ఈ రాశిలోనే ఉండటం వీరికి బాగా కలిసొస్తున్న అంశం. పెళ్లి ప్రయత్నాలు ఎలాంటి ఆటంకం లేకుండా ఫలిస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఇది అద్భుతమైన సమయం. ఆర్థికంగా చాలా బాగుంటుంది.
సింహ రాశి : నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు.. ఈ సూర్యుడికి అధిపతి సింహరాశి. ప్రస్తుతం బృహస్పతి రోహిణి నక్షత్రంలో ఉండటం ఈ రాశివారికి బాగా కలిసొచ్చే అంశం. వ్యాపారస్తలకు పెట్టుబడులకు అనువైన సమయం. ఇక ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగానూ చాలా బాగుంటుంది.
ధనుస్సు రాశి : ధనుస్సు రాశిని గురువు పాలిస్తాడు. కాబట్టి ఈ రాశివారికి అన్ని విధాలుగా బాగుంటుంది. కోర్టు పనులు, ఆస్తి వ్యవహారాలు అన్నీ ఓ కొలిక్కి వస్తాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం.