శ్రీకృష్ణుడి విగ్రహంపై చెత్త, గోమయం..

కృష్ణార్పణం అనే పదం వినని హిందువు అంటూ ఉండడు. ఏదైనా పూజ జరిగినా గొప్ప పని చేసినా ఫలితాన్ని భగవంతునికి అర్పించేస్తాం. ఈ క్రమంలోనే కృష్ణార్పణం అనే పదం వాడుతూ ఉంటాం. శ్రీకృష్ణుడిపై అమితమైన భక్తి శ్రద్ధలున్నవారు తమ ప్రతి విజయాన్ని స్వామివారి ఖాతాలో వేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది తెలిసి అంటారో.. తెలియక అంటారో కానీ దాని ప్రభావం మాత్రం తప్పక పని చేసే మహిమాన్వితమైన మంత్రం. ఒక అమాయకురాలు ‘కృష్ణార్పణం’ మాటనే మంత్రంగా భావించింది. తద్వారా ఆమె కృష్ణ ప్రేమను పొందింది. ఆ కథేంటో మనం తెలుసుకుందాం.

ద్వారక గురించి అందరికీ తెలిసిందే.. అది శ్రీకృష్ణుడు నడయాడిన నేల. దీనికి సమీపంలోని ఒక గొల్లపల్లెలో గోవిందమ్మ అనే ఒక నిరుపేద అయిన అమాయక కృష్ణ భక్తురాలు ఉండేది. ఆమె గోవు పాలు, పెరుగు, నెయ్యి అమ్ముకుంటూ జీవించేది. అయితే ఒకరోజు గోవిందమ్మకు ‘కృష్ణార్పణం’ అనే మాట వినిపించింది. అదేదో తారకమంత్రంలా ఆమె భావించింది. అప్పటి నుంచి ప్రతి విషయానికీ ‘కృష్ణార్పణం’ అని అనడం మొదలు పెట్టింది. రాను రానూ లేచింది మొదలు.. నిద్రపోయే వరకూ ప్రతి దానికీ మాటకు ముందు, చివర.. కృష్ణార్పణం అని అనడం ఆమెకు అలవాటైంది. చివరకు గోమయం, చెత్త ఎత్తేటప్పుడు సైతం కృష్ణార్పణం అనేది. ఇది ఊరంతా పాకింది. గోవిందమ్మ అలా అనడం మొదలు పెట్టిన నాటి నుంచి ఊరిలోని శ్రీకృష్ణుడి దేవాలయంలో ఉన్న కృష్ణుని విగ్రహంపై చెత్త, గోమయం పడుతోంది. పూజారి శుభ్రం చేసినా మళ్లీ మళ్లీ అలా పడుతూనే ఉంది. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends