ఇవాళ్టి నుంచి నెలరోజులు అత్యంత పవిత్రమట.. ఎందుకంటే..

సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా అక్టోబర్ నెలలో ఈ రోజున (అక్టోబర్ 17)న కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇవాళ్టి నుంచి ఈ నెల రోజులూ అత్యంత పవిత్రంగా భావిస్తారు. అది ఎందుకు? వంటి అంశాలను పరిశీలిద్దాం. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ఇవాళ ఉదయం 7:43 నిమిషాలకు సూర్యుడు కన్యారాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఈ నెల రోజులను అత్యంత శుభకరంగానూ.. పవిత్రంగానూ భావిస్తూ ఉంటారు.

ఈ మాసం నుంచి పటికాలం తగ్గుతూ, రాత్రి కాలం పెరుగుతూ వస్తుంది కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చాలా శ్రేష్టంగా భావిస్తుంటారు. తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు. అలాగే ఇవాళ్టికి మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే.. హిందూ సౌరమాన పంచాంగం ప్రకారం ఈ రోజు కార్తీక మాసం తొలి రోజు అవుతుంది. దీనిని హిందువులంతా వేడుకగా జరపుకుంటారు. ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు పడే సంతోషం.. రైతులు పెద్ద ఎత్తున పండించిన పంట విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు.

Share this post with your friends