ధంతేరాస్ నాడు ఇవి కొని ఇంటికి తీసుకొచ్చినా డబ్బుకు లోటుండదట..

ధంతేరాస్ ఈ నెల 29న రానుంది. ఆ రోజున ధన్వంతరీతో పాటు లక్ష్మీదేవిని పూజించుకుంటాం. దీని వల్ల సకల ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నమ్మకం. ఈ ధంతేరాస్ నుంచే దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు దీపావళిని జరుపుకుంటారు. ధంతేరాస్ నాడు బంగారం, వెండి ఆభరణాలను కొంత మంది తెచ్చుకుంటారు. అవి తెచ్చుకోలేని వారు తమ స్తోమతకు తగ్గట్టుగా కొన్ని వస్తువులను తెచ్చుకుంటారు. వాటిలో చీపురు, శ్రీయంత్రం, గోమతి చక్రం వంటి వాటిని కొనుగోలు చేయవచ్చని చెబుతారు.

ఈ ధనత్రయోదశి నాడు మనం పైన చెప్పుకున్నవే కాకుండా మరో రెండింటిని కూడా కొనవచ్చట. అవేంటో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టినా తమల పాకులను ఉపయోగిస్తూ ఉంటారు. తమల పాకులను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా భావిస్తారు. కాబట్టి ధనత్రయోదశి నాడు తమల పాకులను కొని తీసుకొచ్చి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయట. పూజానంతరం వాటిని ఓ పవిత్ర నదిలో వదిలేస్తే మంచిదట. అలాగే కొత్తమీర కొని ఇంటికి తీసుకొచ్చినా మంచిదట. కొత్తమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు కాబట్టి దానిని కొని తీసుకొచ్చినా డబ్బుకు లోటుండదట.

Share this post with your friends