జన్మాష్టమి రోజున ఏం చేస్తే ఫలితం బాగుంటుందో తెలుసా?

జన్మష్టమి పండుగను జరుపుకునేందుకు దేశం యావత్తు సిద్ధమవుతోంది. శ్రీకృష్ణుడి పుట్టిన రోజును జన్మాష్టమిగా జరుపుకుంటామన్న విషయం తెలిసిందే. ఇక ఆ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన ఫలితం విశేషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మనం కోరిన కోరికలు నెరవేరాలంటే ఒక క్రమ పద్ధతిలో శ్రీకృష్ణుడికి పూజ చేయాలి. మరి జన్మాష్టమి రోజున ఏం చేయాలో చూద్దాం. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాల రూపమైన లడ్డూ గోపాలునికి దక్షిణవర్తి శంఖంతో అభిషేకం చేస్తే చాలా మంచిదట. విశేష ఫలితం ఉంటుందట. ఇక అభిషేకానంతరం కృష్ణ చాలీసా లేదంటే విష్ణు సహస్ర నామాలను పఠించాలి.

ఇలా చేయడం వలన ఆర్థిక స్థితి బలపడి జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం. ఇక మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే జన్మాష్టమి రోజున రాత్రి 12 గంటల తర్వాత శ్రీకృష్ణుని ఆరాధన సమయంలో తప్పకుండా తమలపాకులను సమర్పించాలట. తరువాతి రోజున తప్పకుండా తమలపాకులపై పసుపుతో శ్రీ యంత్రాన్ని తయారు చేసి దానిని సురక్షితంగా డబ్బు ఉంచే స్థలంలో ఉంచాలట. ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందడంతో పాటు సంపద కూడా పెరుగుతుందట. అలాగే శ్రీకృష్ణుడిని నైవేద్యంగా వెన్న, మిఠాయిని సమర్పించాలి. కన్నయ్యకు వేణువుని సమర్పిస్తే మరీ మంచిది. ఇలా చేస్తే జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్మకం.

Share this post with your friends