హిందూ సంప్రదాయంలో చాలా ఆచారాలుంటాయి. ప్రత్యేకంగా కొన్ని పనులు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. గోళ్లు కత్తిరించుకోవడం, అలాగే హెయిర్ కట్ చేయించుకోవడం వంటివి అన్ని వేళలా చేయకూడదు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో హెయిర్ కట్ చేయించకూడదని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. కొందరు అవేమీ పట్టించుకోకుండా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటారు. అసలు హెయిర్ కట్ నిబంధనలేంటో తెలుసుకుందాం. మంగళవారం హెయిర్ కట్ చేయించుకోకూడదట. శుక్రవారం మాత్రం చేయించుకుంటే చాలా మంచిదట. ఇక హెయిర్ కట్ అనేది ఉదయం 12 గంటల్లోపు చేయించుకోవాలి. రాత్రి సమయంలో హెయిర్ కట్ చేయించుకోకపోవడం ఉత్తమం. హెయిర్‌కట్ నిబంధనలేంటో తెలుసుకుందాం.
ఒకే ఇంటికి చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకేసారి వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు. చాలా మంది ఆదివారం శెలవు కాబట్టి ఆరోజున హెయిర్ కట్ చేయించుకుంటారు. కానీ ఆ రోజున హెయిర్ కట్ చేయించుకోకూడదు. చేయించుకుంటే ఆయువు ఒక మాసం తగ్గిపోతుందట. సోమవారం హెయిర్ కట్ చేయించుకుంటే చాలా మంచిదట. ఆయువు ఏడు మాసాల వృద్ధి చెందుతుందట. మంగళ వారం క్షవరం వల్ల ఏడు మసాలా ఆయువు తగ్గిపోతుందట. బుధవారం క్షవరంతో ఆయువు ఐదు మాసాలు వృద్ది.. గురువారం చేయించుకుంటే 10 మాసాల వృద్ధి, పైగా ఆర్థిక ఎదుగుదల ఉంటుందట. శుక్రవారం చేయించుకోవడం చాలా మంచిదట. ఈ రోజున చేయించుకుంటే 11 మసాలా ఆయువు వృద్ధి.. శనివారం చేయించుకుంటే ఏడు మాసాల ఆయువు తగ్గుతుందట.