శ్రావణ మాసమంతా చాలా పండుగలు, శుభదినాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. అలాగే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. అయితే ఈ శుక్రవారం వీలు పడని వారం మూడో శుక్రవారం వ్రతం ఆచరిస్తారు. ఇక ఆగస్ట్ 2వ తేదీన మాస శివరాత్రి. అది అయిపోయింది కాబట్టి ఆ తరువాత వచ్చే పండుగలు శుభదినాల గురించి చూద్దాం. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ శ్రావణ మాసంలో శాస్త్రాలలో చెప్పిన విధంగా పూజలు, వ్రతాలు, నియమాలు ఆచరించి సకల శుభాలు అనంత సౌభాగ్యాలు పొందుతాం.
ఆగస్ట్ 4: బోనాలు, ఫ్రెండ్‌షిప్‌డే
ఆగస్ట్ 5: చంద్రదర్శనం, వర్ష ఋతువు ప్రారంభం
ఆగస్ట్ 6: శ్రావణ మంగళ గౌరీ వ్రతం
ఆగస్ట్ 8: దూర్వాగణపతి వ్రతం
ఆగస్ట్9: నాగపంచమి
ఆగస్ట్11: భానుసప్తమి
ఆగస్ట్15: భారత స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్16: వరలక్ష్మీ వ్రతం
ఆగస్ట్17: శనిత్రయోదశి
ఆగస్ట్19: రాఖీ పూర్ణిమ
ఆగస్ట్ 26: శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్31: శనిత్రయోదశి
సెప్టెంబర్1: శ్రావణ బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి
సెప్టెంబర్ 2: శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటాం