ఆరుపడైవీడు గురించి తెలుసా? ఇవి ఒకటి కాదు ఆరు ఉన్నాయి. అసురుడైన సూరపద్ముడి సంహారానికి సుబ్రహ్మణ్యస్వామి ఏర్పాటు చేసిన ఆరు రణ శిబిరాలను ఏర్పాటు చేశాడు. వీటిని తమిళంలో ఆరుపడైవీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలనేవి.. తిరుచెందూర్, పళణి, తిరుత్తణి, స్వామిమలై, పళమ్‌ముదిర్ చోళైతో పాటు తిరుప్పన్‌కుండ్రం. ఇది తమిళనాడు మధురై జిల్లాలో ఈ తిరుప్పరన్‌కుండ్రం ఉంది. కొండ దిగువన శిలలను తొలిచి దీనిని నిర్మించారు. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ శిల్పకళను చూస్తే కళ్లు తిప్పుకోవడం కష్టం. అంత అద్భుతంగా ఉంటుంది.
ఈ ఆలయం ఈనాటిది కాదు.. పాండ్యుల కాలంలోనే నిర్మించారట. ఈ విషయాలను శాసనాలు వివరిస్తున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం ఉన్నట్టు ఆధారాలున్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. కొండను తొలిచి ఆలయాన్ని నిరన్మించడమే అద్భుతమంటే.. పలు దేవతల విగ్రహాలను చెక్కిన విధానం మరో అద్భుతం. దేవతల విగ్రహాలు ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంటాయి. ఆరుపడైవీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం. ఆరుపడైవీడులోని అన్ని ఆలయాల్లో మురుగన్ నిలుచొని అభయమిస్తుండగా.. ఈ ఒక్క ఆలయంలో మాత్రం ఆసీనుడై భక్తులకు అభయమిస్తూ ఉండటం మరో విశేషం.