తెలుగు రాష్ట్రాల్లో రహస్య ఆలయాలు చాలా ఉన్నాయి. చాలా ఆలయాలు తవ్వకాలలో బయటపడుతున్నాయి. ఇవన్నీ గత చరిత్రకు.. వైభవానికి సజీవ సాక్ష్యాలు. ఏపీలో ొక ఆలయం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణమేంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ కల్కి షూటింగ్ ఈ ఆలయ పరిధిలో జరిగిందట. అయితే ఈ ఆలయం 200 ఏళ్ల నాటిదని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆలయం ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న పెన్నానదీ తీరంలో ఇసుకలో నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. ఈ ఆలయం ఇసుక తవ్వకాల్లో బయటపడింది. 2020లో చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి వచ్చింది.
దీనిపై పరిశోధనలు నిర్వహించిన పురావస్తు శాఖ అధికారులు ఇది 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 1850లో వచ్చిన వరదల కారణంగా పెన్నానది ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయం కింద వందల ఎకరాల మాన్యం ఉంది. ఆలయం బయటపడిన వెంటనే ఇసుక తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. వెంటనే చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కల్కి సినిమాలో ఈ ఆలయ ప్రస్తావన ఉందని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలోనూ షూటింగ్ నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ఆలయం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తోంది.