శివ సంహార రూపాల గురించి తెలుసా?

భోళా శంకరుడు.. కాసిన్ని నీళ్లతో అభిషేకించినా అనుగ్రహిస్తాడని అనుకుంటాం కదా.. అనుగ్రహ రూపాలే కాడు.. శివుడికి సంహార రూపాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఆరాధ్యనీయమైనవే. మహేశ్వరుడి సంహార రూపాలు ఐదు. అవేంటంటే.. జలంధర వధమూర్తి, త్రిపుర సంహారమూర్తి, మన్మథ సంహారమూర్తి, గజ సంహారమూర్తి, కాల సంహారమూర్తి. శివుడి త్రినేత్రం నుంచి జన్మించినవాడు.. జలంధరుడు. అయితే విపరీతమైన గర్వంతో దేవతలను సైతం హింసిస్తుండేవాడు. దేవతలంతా వెళ్లి పరమేశ్వరుడికి మొర పెట్టుకోవడంతో తన చక్రాయుధంతో జలంధరుణ్ణి సంహరించాడు. అప్పుడు జలంధరుడి నుంచి ఒక జ్యోతి బయటకు వచ్చిందట. అది శివుడి త్రినేత్రంలో ఐక్యమైందని చెబుతారు.

ఆ స్వరూపమే జలంధరహరమూర్తి రూపం. ఇక శివుడి మరో రూపం త్రిపుర సంహారమూర్తి. తారకాసురుడికి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు బ్రహ్మ గురించి తపస్సు చేసి గాలిలో ఎగిరే మూడు నగరాలను వరంగా పొందారు. వరం చేతికి వచ్చీ రాగానే మూడు నగరాలనూ ఇష్టారాజ్యంగా గాలిలో తిప్పడం ప్రారంభించారు. దీంతో ఆ మూడు నగరాలకు చెందిన దేవతలు పరమేశ్వరుని ఆశ్రయించగా.. త్రిపురాసుర సంహారం గావిస్తానని మాటిచ్చాడు. త్రిపురాసుర సంహారానికి భూమి రథం కాగా, సూర్యచంద్రులు రథచక్రాలు.. నాలుగు వేదాలు.. నాలుగు అశ్వాలుగా.. బ్రహ్మదేవుడు రథ సారధిగా మారారు. ఇక మేరు పర్వతం ధనుస్సుగా రూపొందగా, ఆదిశేషుడు విల్లు తాడవగా.. విష్ణువే బాణమయ్యాడు. ప్రళయ కాలాగ్ని కీలలు ఆకాశమంతా నిండుతుండగా పరమేశ్వరుడు బాణాన్ని వదిలి త్రిపురాల్లోని రాక్షసులను సంహరించాడు.

Share this post with your friends