బుధ ప్రదోష వ్రతం గురించి తెలుసా? అదెప్పుడంటే..

జాతకంలో కొన్ని దోషాలు మనిషిని వేధిస్తూ ఉంటాయి. వాటిలో బుధ దోషం కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో బుధ దోషం ఉంటే వారు బుధ ప్రదోష వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతం చేయడం వలన జాతకంలో బుధ గ్రహం బలపడటంతో పాటు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం కూడా లభిస్తుందట. అయితే ఈ వ్రతాన్ని ఎలా పడితే అలా ఆచరించకూడదట. మరి ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటారా? హిందూ మతంలో ప్రదోష వ్రతం ప్రతి సంవత్సరం కృష్ణ పక్షం.. ప్రతి నెల శుక్ల పక్షం త్రయోదశి రోజున వస్తుంది. అంటే రేపే అన్నమాట. ఈ వ్రతం బుధవారం రోజున వస్తుంది కాబట్టి బుధ ప్రదోష వ్రతమని అంటారు.

ఈ త్రయోదశి తిధిలో శివ పార్వతులతో పాటు గణపతిని ఆరాధిస్తారు. ఈ రోజున దానం చేయడం వలన శివపార్వతులు చాలా సంతోషిస్తారట. ఈ రోజు చేసే ఉపవాసానికి మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఇక ఈ తిథి ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందంటారా? పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష త్రయోదశి తిథి జూన్ 19న ఉదయం 07:28 గంటలకు ప్రారంభమై.. తదుపరి రోజున ఉదయం 07:49 గంటలకు ముగుస్తుంది. ఇక పూజకు ఉత్తమ సమయం ఏంటంటే.. సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు .. సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాలు. ఈ సమయంలో వ్రతాన్ని ఆచరిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయట.

Share this post with your friends