మన జీవితాన్ని శాసించేది నవ గ్రహాలేనని అంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మన జీవితంపై వీటి ప్రభావం చాలా ఉంటుందట. ఈ నవ గ్రహ్మాల్లో త్రిమూర్తులు త్రిదేవినులు కొలువై ఉంటారని నమ్మకం. హరిహరులు సైతం గ్రహ రూపంలోనే కొలువై ఉంటారని గ్రహరూపి మహేశ్వర అనే వచనం చెబుతోంది. నవగ్రహాల కారణంగా జరిగే అశుభాల నుంచి తప్పించుకునేందుకు నిత్యం పూజించుకుంటూ ఉండాలట. దీని వలన పూర్తిగా దోషం నుంచి బయటపడతామని కాదు కానీ పెను ప్రమాదమైతే ఉండదట. పైగా గ్రహ శాంతితో పాటు దోష నివారణ కోసం తప్పని సరిగా దానాలు చేయాలట. దీని వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందట.
ఇక ఏ ఏ గ్రహానికి వేటి వేటిని దానం చేయాలి? గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయడంతో పాటు కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరిస్తే మంచి జరుగుతుందట. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేయాలట. అలాగే ముత్యాన్ని ధరించాలట. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానంతో పాటు పగడపు ఉంగరాన్ని ధరించాలి. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయడంతో పచ్చల ఉంగరాన్ని వేలికి పెట్టుకోవాలి. శుక్రుని పూజలో అలసందలు.. రాహు పూజకు మినుములు.. కేతువు పూజలో ఉలవలు.. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. ఇలా చేస్తే నవగ్రహాలు సంతృప్తి చెంది మనకు అవసరమైన సుఖశాంతులను కలుగు చేస్తాయట.