ఆర్థిక సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అప్పులతో పాటు అవసరానికి డబ్బు చేతికి అందదు.. ఒకవేళ డబ్బు చేతికి వచ్చినా కూడా మంచినీళ్ల మాదిరిగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే పరిష్కారం లేని సమస్యలంటూ ఉండవు. అలాంటప్పుడు ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది కదా.. అదేంటో చూద్దాం. ఇంట్లో కర్పూరంతో పాటు లవంగాలను కలిపి కాల్చితే ఇంట్లో ఉండే గాలి శుద్ధి అవడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్ వంటివి నశిస్తాయట. పైగా ఇంట్లో వాస్తు దోషాలకు కూడా చెక్ పెడుతుందట.
ఇంట్లో కర్పూరం, లవంగాలను కలిపి కాల్చడం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. అలాగే కర్పూరం, బిర్యానీ ఆకును కలిపి కాల్చినా ప్రయోజనం ఉంటుందట. ఆరోగ్యమే కాదు.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయట. శ్వాస సంబంధ సమస్యలూ దూరమవుతాయట. ఇక కర్పూరం, దాల్చిన చెక్కను కలిపి కాస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందట. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి బాగా కలిసొస్తుందట. మొత్తానికి కర్పూరం ఇంటి వాతావరణాన్నే మార్చేస్తుందట.