సాయంత్రం వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు కట్ చేయకండి.. ఎందుకంటే..

ప్రతి పనికీ ఓ సమయం అంటూ ఉంటుంది. ముఖ్యంగా గోళ్లను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కట్ చేయవద్దని పెద్దలు చెబుతారు. ఇది ఇవాళ్టిది కాదు.. ఎన్నాళ్ల నుంచో జరుగుతూ వస్తోంది. గోళ్లను ముఖ్యంగా నట్టింట్లో కూర్చొని కట్ చేయవద్దని అంటారు. అలాగే మంచంపై కూర్చొని కూడా కట్ చేయకూడదు. అదే విధంగా మంగళవారం కానీ, శుక్రవారం కానీ కట్ చేయవద్దని అంటారు. ఇక సాయంత్రం వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు కట్ చేసుకోకూడదట. దీనికి కారణం ఏంటి? సాయంత్రం వేళ గోళ్లు కట్ చేస్తే ఏమవుతుంది? వంటి అంశాలను చూద్దాం.

సాయంత్రం పూట గోళ్లు కట్ చేసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతారు. సూర్యాస్తమయం తరువాత గోళ్లు కట్ చేస్తే ఆర్థిక కష్టాలు వెంటాడుతాయట. జీవితంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందట. ఆహారం విషయంలోనూ అవస్థలు తప్పవట. దీనికి కారణం సాయంత్రం వేళ గోళ్లు కట్ చేస్తే శనీశ్వరుడికి కోపం రావడమేనని అంటారు. ఆయనకు కోపం వస్తే ఇంకేముంది? జీవితం సమస్యల మయమవుతుంది. ఆర్థిక పరిస్థితి అదుపు తప్పుతుంది. ఆదాయం తగ్గిపోతుంది. రాత్రి పూట శని గ్రహాన్ని పాలక గ్రహంగా భావిస్తారు కాబట్టి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు కట్ చేయకూడదట.

Share this post with your friends