ఈ దేవతల విగ్రహాలు లేదా చిత్రపటాలను మీ ఇంట అస్సలు పెట్టుకోకండి..

వాస్తవానికి ప్రతి ఇంట్లోని పూజ గదిలో వివిధ దేవుళ్ళు, దేవతల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ కాబట్టి దేవతల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటాయి. అయితే అందరు దేవతల విగ్రహాలు లేదంటే చిత్రాలను ఇంట్లో పెట్టుకోకూడదట. అలా పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందట. మరి ఏ ఏ దేవతల విగ్రహాలను లేదా చిత్రాలను ఇంట్లో పెట్టుకోకూడదో చూద్దాం. హిందూ మతంలో కర్మ ప్రదాతగానూ.. న్యాయ దేవుడిగానూ పరిగణించే శనిశ్వరుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఇంటి పూజ గదిలో ఉంచవద్దు.

కారణమేంటంటే.. శనిశ్వరుడి ప్రభావం ఒకరోజో.. రెండు రోజులో కాదు.. ఏళ్లకేళ్లు ఉంటుంది. కనుక శనీశ్వరుడిని ఇంట్లో కాకుండా ఆలయంలో ఉన్న విగ్రహాన్ని పుజించడం శుభప్రదంగా పరిగణిస్తూ ఉంటాం. ఇక కాళికాదేవి విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని కూడా ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే అమ్మవారి నియమాలు పాటించడం చాలా కష్టం. వాటికి ఏమైనా ఇబ్బంది వాటిల్లితే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి కాళికా దేవిని పూజ గదిలో పెట్టుకోకూడదు. నటరాజ విగ్రహాన్ని సైతం ఇంట్లో పెట్టుకోకూడదట. ఎందుకంటే.. శివుని ఉగ్రరూపంగా నటరాజును భావిస్తారు. ఈ క్రమంలోనే నటరాజ విగ్రహం లేదా చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచుకోకూడదట. ఇది ఉంటే ఇంట్లో కలతలు వస్తాయట. నిలబడిన గణేశుడు, లక్ష్మీదేవి దేవతలు, దేవతల విగ్రహాలను సైతం ఇంట్లో పెట్టుకోకూడదట.

Share this post with your friends