గత 17 ఏళ్లుగా హైందవధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది భక్తిటీవీ. ఆధ్యాత్మిక జగత్తులో భక్తిటీవీది ఓ ప్రత్యేక స్థానం. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తికమాసంలో హైదరాబాద్ వేదికగా భక్తిటీవీ నిర్వహిస్తున్న “కోటి దీపోత్సవం” కార్యక్రమం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలుసు. గత ఏడాది భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరపురాని ఘట్టం. అటువంటి మహత్తర “మహా దీప యజ్ఞం” ఈ ఎడాది కూడా మీ అందరి కోసం భక్తి టీవీ నిర్వహిస్తోంది.
కార్తికమాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. అటువంటిది కోటి దీపాలతో మహాదేవుడికి నీరాజనం సమర్పించే అద్భుత దీపయజ్ఞానికి తరలిరండి. భక్తిటీవి ఆధ్వర్యంలో నవంబరు 9 నుంచి నవంబరు 25 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం లో జరగనున్న కోటి దీపోత్సవంలో మీరూ పాల్గొనండి. ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం గం|| 5.30 ని||లకు ప్రారంభమవుతుంది. జగద్గురువులు, పీఠాధిపతుల సమక్షంలో.. కైలాసాన్ని తలపించే మహాప్రాంగణంలో మహాదేవుడి అనుగ్రహానికై కార్తికదీపాలు వెలిగించండి. ప్రతిరోజూ జరిగే మహా రుద్రాభిషేకాలు, కల్యాణోత్సవాలు, రథోత్సవాలు, అరుదైన దేవతామూర్తుల దర్శనాలు, విశేష పూజలు, తదితర కార్యక్రమాలను దర్శించి తరించండి. పరమేశ్వరుడి కటాక్షానికి పాత్రులుకండి.
కార్తిక మాసాన కోటి దీపోత్సవం.. మహాదేవుడి అనుగ్రహానికి సోపానం..!
కోటిదీపాల కాంతులు.. పీఠాధిపతుల ఆశీర్వచనాలు..!
ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు.. అపూర్వ సాంస్కృతిక కార్యక్రమాలు..!
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.. రండి.. తరలిరండి..!
#kotideepotsavam #kotideepotsavam2024