వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు వైభవంగా జరిగింది. పెళ్లికి ముందు అమ్మవారిని 27 చీరలు, స్వామివారిని 11 పంచెలతో అలంకారం చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మహాదేవ శివయ్యతో వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లనూ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

బల్కంపేట ఎల్లమ్మను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణ ఉత్సవం వైభవంగా సాగుతోందన్నారు.కల్యాణ ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఇక ఎల్లమ్మ తల్లిని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని మొక్కుకున్నానని వెల్లడించారు. ఇక రేపటి వరకూ అమ్మవారి ఉత్సవాలు కొనసాగనున్నాయి.

Share this post with your friends