బడ మంగళ్ ప్రత్యేకతే వేరు.. దీని గురించి తెలిస్తే..

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం హనుమంతుని ఆరాధనకు విశిష్ట స్థానముంది. ముఖ్యంగా మంగళవారం హనుమంతుడి పూజకు మరింత అనుకూలమైన రోజు. పైగా జ్యేష్ట మాసంలో వచ్చే మంగళవారాలను బడ మంగళ్ అని పిలుస్తారు. ఇది హనుమంతుడి ఆరాధనకు మరింత పవిత్రమైన రోజట. సాధారణ మంగళవారాల్లో హనుమంతుడిని ఆరాధించే దానికంటే ముఖ్యంగా ఇవాళ ఆరాధిస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుందట. ఇవాళ హనుమంతుడిని ఆరాధిస్తే ఆర్థిక బాధల నుంచి ఉపశమనం లభిస్తుందట.

ఇవాళ హనుమంతుడిని పూజిస్తే మన కోరికలు తప్పక నెరవేరుతాయట. ముఖ్యంగా ఇవాళ తమలపాకులను స్వామివారికి విశేషంగా సమర్పిస్తే కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయట. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయట. ఇవాళ కానీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్లి ఆయన విగ్రహం వద్ద ఉండే సింధూరాన్ని తీసుకుని సీతమ్మ పాదాలకు సమర్పించాలట. అప్పుడు ఆర్థిక పురోగతి మరింత వేగంగా ఉంటుందట. ఇవాళ హనుమంతుడి విగ్రహానికి 21 అరటి పండ్లు సమర్పించి వాటిని కోతులకు ఆహారంగా సమర్పిస్తే కోరిన కోరిక తప్పక నెరవేరుతుందట.

Share this post with your friends