మహాకుంభమేళా నేపథ్యంలో అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ కీలక నిర్ణయం

మరో 15 రోజుల్లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. దీనికోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్య కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కుంభమేళాకు వచ్చిన వారంతా అయోధ్యను సైతం దర్శించుకునే అవకాశం ఉంది. అందునా అక్కడి వరకూ వెళ్లి అయోధ్య రామయ్యను దర్శించుకోకుండా దాదాపుగా వెనుదిరగారు. ఈ క్రమంలోనే అయోధ్యలోనూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ మందిర దర్శన వేళలు పెంచాలని నిర్ణయించింది. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రామజన్మభూమి ట్రస్ట్ చర్యలు తీసుకుంటోంది. మహాకుంభమేళా కోసం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ వాటర్ డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు. 11 భారతీయ బాషల్లో ఏఐ చాట్ బాట్‌లను కుంభమేళా సమాచారం అందించే నిమిత్తం ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక వసతి, టెంట్లు, షెల్టర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం పారామిలిటరీ బలగాలతో పాటు 50 వేల మంది సిబ్బందిని నియమించారు.

Share this post with your friends