మన పాపాలను పుణ్యం చేసి తగ్గించడం సాధ్యం కాదా? అనే సందేహం ఉంటుంది. అసలు పాపాలను ఎలా తగ్గించుకోవాలనే సందేహం కూడా వస్తుంది. మరి వాస్తవానికి సాధ్యపడదా? తెలుసుకుందాం. పాపాలను పుణ్యంతో తగ్గించం అనేది సాధ్యం కాదని చెబుతారు. దీనికి కారణం ఏంటేంట.. ముళ్ళ మొక్కల బీజాలనూ, పళ్ల మొక్కల బీజాలనూ కలిపి ఎంత బాగా గిలకరించి విత్తినప్పటికీ, ముళ్ళ విత్తనం ముళ్ళమొక్కగానే, పళ్ల విత్తనం పళ్ల మొక్కగానే పెరుగుతుంది.
అయితే దీనికి పరిహారం లేదా?
అయితే పాపానికి పరహారమే లేదా? అంటే.. ఉంటుంది. అది ఎలా అంటే, మీ ఆదాయంలో దానధర్మాలకు ఖర్చు పెడితే, అంతమేరకు ఇన్కమ్ ట్యాక్స్ వారు పన్ను తక్కువ చేస్తారు. అలాగే ఇక్కడ మనస్సు పెట్టి నామస్మరణ చేస్తే ఇంత, నామ జపం చేస్తే మరికొంత, లిఖిత జపం చేస్తే ఇంకా కొంత, ధ్యానం చేస్తే ఇంత అని తగ్గిస్తారు. అయితే పూర్తిగా తగ్గదు. మిగిలినది అనుభవించాలి. అలాంటప్పుడు భగవంతుడి దర్శనం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అంటారా?
ఉరిశిక్ష పడిన ఖైదీకి.. క్షమాభిక్షను రాష్ట్రపతి ప్రసాదించవచ్చు. ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చు. అలాగే అవతార మూర్తి అనుగ్రహం, దుష్కార్యముల ఫలాల తీవ్రతను తగ్గిస్తుంది.
