సప్త మోక్ష క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

మధురను సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటిగా చెప్పుకున్నాం కదా. అసలు సప్త మోక్ష క్షేత్రాలంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం మానవులకు మోక్షాలనిచ్చే పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనవి ఈ భూమిపై ఏడు ఉన్నాయి. ఈ ఏడింటినీ సప్త మోక్ష కేంద్రాలుగా పిలుస్తారు. అవి అయోధ్య, మధుర, మాయ (హరిద్వార్), కాశి, కంచి, అవంతిక (ఉజ్జయిని) మధ్యప్రదేశ్, ద్వారావతి (ద్వారకా) గుజరాత్‌లలో ఉన్నాయి. హిందూ పురాణాలు చెబుతున్న ప్రకారం అయితే.. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఈ ఏడు క్షేత్రాలను దర్శిస్తే మోక్షం ఖాయమట.

ఈ ఏడు నగరాలకు మరో పేరు కూడా ఉంది. అదేంటంటే.. సప్తపురి లేదా సప్తమోక్ష పురములని కూడా అంటారు. హిందువుల నమ్మకం ప్రకారం.. ఈ క్షేత్రాలను దర్శించడం వల్ల మనిషికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించడంతో పాటు మోక్షం సిద్ధిస్తుందట. ఇక మధుర శ్రీకృష్ణుడి ఆలయ విశేషాలను గురించి కూడా తెలుసుకుందాం. శ్రీకృష్ణ జన్మస్థల ఆలయం ప్రాంగణం లోపల ప్రధానంగా మూడు ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి శ్రీకృష్ణుడు కొలువైన కేశవదేవ్ ఆలయం, రెండవది శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల కాగా.. మూడవది భాగవత భవనం ఉన్నాయి.

Share this post with your friends