తులసి వివాహ ప్రాముఖ్యతేంటి?

తులసి వివాహాన్ని హిందువులంతా ఒక పండుగగా జరుపుకుంటారు. హిందువులంతా దాదాపుగా తులసి మొక్కను ఇంటి ముందు నాటి నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్ష ద్వాదశి తిథి నాడు తులసి వివాహం చేస్తారు. అంటే ఈ ఏడాది నవంబర్ 13వ తేదీన తులసి వివాహం జరిపిస్తాం. ఈ రోజున తులసి మొక్కకు పూజలు నిర్వహించి ఆపై వివాహం చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాని వారు తులసి వివాహం చేస్తే వెంటనే వివాహమవుతుందని నమ్మకం. శాలిగ్రామ శిల విష్ణుమూర్తికి ప్రతీక కాబట్టి శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు వీరిద్దరికీ వివాహం జరిపిస్తారు.

తులసి వివాహం జరిపిస్తే భక్తులు ధార్మిక పుణ్యాన్ని పొందుతారట. అసలు తులసి వివాహ ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. వాస్తవానికి తులసి మాతను లక్ష్మీదేవి అవతారంగా పేర్కొంటారు. తులసి మాత సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతికి అధిదేవత. కాబట్టి తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ఉంటుందట. శాలిగ్రామ శిల, తులసిని పూజించడం వల్ల శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది. అలాగే తులసి మొక్కకు వివాహం జరిపించడం వల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలన్నీపోయి సంపద పెరుగుతుందని నమ్మకం.

Share this post with your friends