Symbolism of Fruits : ఆలయంలో నైవేద్యానికి ఎటువంటి పండును సమర్పిస్తే…ఎలాంటి ఫలితాలు వస్తాయంటే

ఆలయానికి వెళ్లినప్పుడు మన హృదయభావాన్ని ప్రతిబింబించే నైవేద్యమే దేవుడికి ఇష్టమని పెద్దలు చెబుతారు. అరటిపండును సమర్పిస్తే ఆగిపోయిన పనులు ముందుకు సాగి, గురుకృప లభిస్తుందని నమ్మకం. కొబ్బరికాయను సమర్పించడం అంటే అహాన్ని విడిచిపెట్టి భగవంతుడికి శరణాగతి కావడమే. దీని వలన కెరీర్‌, వ్యాపారాల్లో స్పష్టత, పురోగతి కలుగుతాయి. ఆపిల్ నైవేద్యంగా పెడితే ఆరోగ్య సమస్యలు తగ్గి ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని విశ్వాసం. ద్రాక్షను సమర్పిస్తే మనసుకు శాంతి, ఆనందం కలుగుతాయి. సపోటా నైవేద్యం త్వరిత వివాహానికి, బంధాల స్థిరత్వానికి సంకేతం. మామిడి పండు ఇంటి నిర్మాణం, అప్పుల నుంచి విముక్తికి శుభసూచకం. ఊదా రంగు పండు శని దోషాల శాంతికి ఉపకరిస్తుంది. డ్రై ఫ్రూట్స్ సంపూర్ణంగా సమర్పిస్తే దేవుడి కటాక్షం మన జీవితంపై నిలుస్తుందని భక్తుల విశ్వాసం.

Symbolism of Fruits
Symbolism of Fruits

 

Share this post with your friends