శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద‌యం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొల్పి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆలయ ఊంజల మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆలయ అర్చకులు తెలియజేశారు.

ఇవాళ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

Share this post with your friends