రేపు బంగారు మైసమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ట

ప్రస్తుతం బోనాల పండుగ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే రేపు (ఆదివారం) బంగారు మైసమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగనుంది. హైదరాబాద్‌లోని చంగిచర్ల అనుశక్తి కాలనీలో బంగారు మైసమ్మ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో బంగారు మైసమ్మ అమ్మవారి విగ్రహానికి రేపు ఉదయం 9:15 గంటలకు ప్రాణ ప్రతిష్టను అర్చకులు, వేద పండితులు నిర్వహించనున్నారు.

తొలుత అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించనున్నారు. అనంతరం విగ్రహ ప్రాణ ప్రతిష్టా మహోత్సవం జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు ఒగ్గు కథా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాన్ని సైతం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానుండటంతో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లనూ ఇప్పటికే ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Share this post with your friends