కరెన్సీ నోట్ల నడుమ మెరిసిపోతున్న శ్రీ మహాలక్ష్మి

ప్రస్తుతం దేశమంతా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. చాలా ప్రాంతాల్లో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తుంది. తాజాగా మహాలక్ష్మి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చింది. ఈ క్రమంలోనే అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించి పూజించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారితో పాటు ఆలయాన్ని రూ.4,41,99,999 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

అలాగే ప్రకాశం జిల్లా,గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ధనలక్ష్మి అలంకారములో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ అమ్మవారిని కూడా కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. ఏలూరు జిల్లా యర్రంపేటలో మహాలక్ష్మి అలంకరణలో గ్రామదేవత అంకాలమ్మ కరెన్సీ నోట్ల నడుమ మెరిసిపోయారు. నిజమాబాద్‌లో అమ్మవారు చుట్టూ బంగారు ఆభరణాలతో దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణకు గానూ బంగారు నెక్టెస్‌లు, హారాలు వంటివన్నీ వినియోగించారు. తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో దర్శనం ఇస్తున్న శ్రీదేవి అమ్మవారిని.. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు కామాక్షి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరంచారు.

Share this post with your friends