కుంభమేళా కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు..

కుంభమేళా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. దీనికోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి రానున్నారు. ఇప్పటికే కుంభమేళా జరగనున్న ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద ఎత్తున రానున్న ప్రజల కోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరగనుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపాలని నిర్ణయించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే వారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.

ఈ 26 ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్‌ నుంచి తెలంగాణలోని మౌలాలి జంక్షన్‌, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. కుంభమేళాకు వెళ్లాలనుకునేవారు ముందుగానే రిజర్వేషన్ చేయించుకుంటే ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చు. మరోవైపు కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కార్ రూ.7500 కోట్లు కేటాయించింది. భద్రతలో భాగంగా దేశం మొత్తం నుంచి 50 వేల మంది పోలీసులు యూపీకి పంపించారు. వీరంతా ఇప్పటికే యూపీకి చేరుకున్నారు. ఏఐ టెక్నాలజీతో వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై ఫోకస్ పెట్టారు.

Share this post with your friends