
జనవరి 13 నుంచి ప్రయాగరాజ్‌లో జరగనున్న కుంభమేళాకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాకుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహా కుంభమేళా కోసం దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. వారందరి కోసం విమానయాన సంస్థ సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మహా కుంభమేళాకు ఎక్కువ మంది రావడంతో హోటళ్లు సైతం రేట్లను పెంచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే దాదాపుగా అంతా కాస్త ధర తక్కువలో లేదంటే ధర్మశాలలు, ఆశ్రమాలను ఆశ్రయిస్తూ ఉంటారు. మరి వారి కోసం ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.
భారత సేవా ఆశ్రమం: ఈ ఆశ్రమం బడ్జెట్ ఫ్రెండ్లీ. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ రూమ్, డబుల్ రూమ్ అదీ కాదంటే బెడ్స్ లెక్కన కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వైఫై సౌకర్యం కూడా ఉంటుంది.
భరద్వాజ ఆశ్రమం: ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది అత్యంత పురాత ప్రదేశం. ఇక్కడ గదులు రూ.500-1000 మధ్య లభిస్తాయి. ఏసీ, నాన్ ఏసీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆశ్రమం ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జైన ధర్మశాల: ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆశ్రమం. ఇక్కడ డబుల్ బెడ్ రూం సుమారు రూ. 500 నుంచి రూ. 1500 వరకు బుక్ చేసుకోవచ్చు.ఇక్కడ కూడా ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి.
