రెండేళ్లకోసారి మేడారం మహా జాతర నిర్వహించడం ఆనవాయితి. అయితే మినీ జాతర కూడా నిర్వహించడం ఆనవాయితీ. దీనికి కూడా భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. ఈ మినీ మహా జాతర నిన్నటి నుంచి ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు అంటే 15వ తేదీ వరకూ మినీ జాతర నిర్వహిస్తున్నారు. ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. మినీ జాతర తొలి రోజైన బుధవారం మేడారంతో పాటు, అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయాలు శుద్ధిచేసి ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజలు నిర్వహించారు.
మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులను తీసుకొచ్చి వనదేవతలకు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు జరుగుతున్న సమయంలోనే కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలోనీ పూజారులు గద్దెల ప్రాంగణానికి వెళ్లి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. మరోవైపు నాయకపోడు పూజారులు కూడా ఘట్టమ్మ గుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు నిర్వహించి.. పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.