కుంభమేళాలో భక్తులకు మహా ప్రసాదం.. ఇస్కాన్‌కు ఆదానీ గ్రూప్ సాయం..

మహాకుంభమేళాకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జనవరి 13 నుంచే ఈ కుంభమేళా ప్రారంభం కానుంది. ప్రయాగ్‌రాజ్‌లో ఈ మహాకుంభమేళా కోసం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు ఈ కుంభమేళాకు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే భక్తుల ఆకలి తీర్చే బాధ్యతను ఇస్కాన్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మహత్తర కార్యక్రమానికి ఆదానీ గ్రూప్ తన వంతు సాయమందించనుంది. అదానీ గ్రూప్, యు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)లు సంయుక్తంగా ఈ సంవత్సరం మహా కుంభమేళా నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌కు హాజరయ్యే భక్తులకు భోజనం అందించడానికి చేతులు కలిపాయి.

45 రోజుల పాటు ఈ మహా ప్రసాద సేవ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి మహత్కార్యంలో పాలు పాలుపంచుకునే అవకాశం కల్పించిన ఇస్కాన్‌కు గౌతమ్ అదానీ కృతజ్ఞతలు చెప్పారు. కుంభం ఒక పవిత్రమైన సేవా క్షేత్రమని.. ఇలాంటి ప్రదేశంలో మహాప్రసాద సేవ చేయడం తన అదృష్టమని గౌతమ్ అదానీ తెలిపారు. లక్షలాది మంది భక్తులకు అన్నపూర్ణమ్మ ఆశీస్సులతో ఉచితంగా మహా ప్రసాద సేవ చేయనున్నట్టు తెలిపారు. 50 లక్షల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కేవలం మహాకుంభమేళా ప్రాంతంలోనే కాకుండా వెలుపల సైతం రెండు వంటశాలల్లో భోజనాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

Share this post with your friends