మహాకుంభమేళాలో ప్రసాద తయారీలో పాల్గొన్న గౌతమ్ అదాని

మహాకుంభమేళా పెద్ద ఎత్తున జరుగుతోంది. భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు పెద్ద ఎత్తున ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో ఇప్పటికే దాదాపు పది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానమాచరిస్తున్నారు. మౌని అమావాస్య నాడు ప్రధాన అమృత స్నాన మహోత్సవం జరగనుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సైతం మహా కుంభమేళాకు వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అదానీ గ్రూప్ సహకారంతో ఇస్కాన్ ఆధ్వర్యంలో కుంభమేళ యాత్రీకులకు మహాప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.నిన్న ఉదయమే ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన గౌతమ్ ఆదాని.. నేరుగా ఇస్కాన్ ఆలయాన్ని దర్శించుకుని అక్కడి నుంచి ప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ క్యాంపులో అదానీ తనవంతు సేవలు అందించారు. అంతేకాకుండా ప్రసాద తయారీలోనూ అదానీ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇస్కాన్ కిచెన్‌లో ప్రసాదం తయారీలో కూడా సాయం అందించారు. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం అదానీ గ్రూప్ బ్యాటరీతో నడిచే గ్రీన్ గోల్ఫ్ కార్ట్ సేవలను ప్రారంభించింది.

Share this post with your friends