
బెంగళూరుకు చెందిన అలెన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు విరాళాన్ని శనివారం అందించారు. ఈ విరాళానికి చెందిన డిడిని తిరుమల అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా, త్వరితగతిన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, ఎఫ్ఎంఎస్ మానిటరింగ్, వాట్సాప్ గవర్నెన్స్, గూగుల్ తో ఒప్పందం, ఆధార్ నమోదు, కియోస్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఫీడ్ బ్యాక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ విధానం ద్వారా పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
