అయోధ్యలో రామయ్య కొలువుదీరడంతో హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. మందిరం కట్టినప్పటి నుంచి ఇంకా పూర్తి కాకుండానే దేశ విదేశాల నుంచి సందర్శకులు వచ్చి రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాతఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనుల ద్వారా జీఎస్‌టీ మొత్తం రూ.400 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాస్ ఆలయాల సహా 70 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 18 ఆలయాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
18 ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి బకాయి పెట్టకుండా 100 శాతం పన్ను చెల్లిస్తామని చంపత్ రాయ్ స్పష్టం చేశారు. అయోధ్యలో చేపడుతున్న ఆలయాల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్ల వరకూ జీఎస్టీ వసూల GST వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేసారు. పనులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన పన్ను మొత్తం తెలుస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో శివాలయాన్ని సైతం నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న బకవా గ్రామం అద్భుతమైన శివలింగ నిర్మాణానికి ప్రసిద్ధి చెందినదని.. అక్కడే రామ మందిర ప్రాంగణంలో ప్రతిష్టించే శివలింగానికి ఆర్డర్ ఇస్తున్నట్టు చంపత్ రాయ్ తెలిపారు.