11 నుంచి అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు..

అయోధ్యంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే రామనగరిని అందంగా ముస్తాబు చేయనుంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహంచనున్న ఉత్సవాల సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ ప్రాంత ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వెల్లడించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వార్షికోత్సవాన్ని పెద్ద ఎత్తు నిర్వహంచున్నట్టు చంపత్ రాయ్ తెలిపారు.

2024 జనవరి 22న పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి రోజున దేశ ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తూ పెద్ద ఎత్తున అయోధ్యలో బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని చంపత్‌రాయ్ తెలిపారు. ఈ క్రమంలోనే ష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి ఈ ఏడాది 2025 జనవరి నెలలో జనవరి 11న వచ్చింది. కాబ్టి ఆ తిథిని హిందూ పంచాంగం ప్రకారం ‘ప్రతిష్ఠ ద్వాదశి’ గా పిలుస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాణప్రతష్టకు సంబంధించిన ఉత్సవాలను శ్రీ రామజన్మభూమి ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 11 నుంచి మూడు రోజుల పాటు నాలుగు చోట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Share this post with your friends