సెప్టెంబర్ ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది.. ఇక ఆలస్యం చేయకుండా కోనేయండి..!

శుంక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

వినాయకుడు ఆదిదేవుడు. ఆయన చవితిపూట (సెప్టెంబర్ 7) మనందరి పూజలు అందుకుని, మనకు విజయాలు చేకూర్చడానికి విచ్చేస్తున్నాడు. కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించలేం. భక్తిశ్రద్ధలతో, చిత్తశుద్ధితో సమర్పించే గరికపోచకే ఆయస ప్రసన్నుడవుతాడు. మనకు అన్నీ ఇచ్చి, మననుంచి ఏమీ ఆశించని గొప్పవాడు భగవంతుడు. ఆయన మనకు ఈ జీవితం అనే అరుదైన అవకాశమిచ్చాడు. అందుకే మనం నిత్యం వివిధ స్తోత్రాలు, పూజలు చేయడం ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం. మనకు నేలా నింగి నీరూ నిప్పూ వీచే గాలీ అన్నీ దైవాలే. ప్రకృతినే పరమేశ్వరునికి మరోరూపంగా భావించే సంప్రదాయం మనది. అటువంటి ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా ప్రవర్తించడం భక్తిపరులుగా మనందరి కర్తవ్యం. మన ఆచారాలు, సంప్రదాయాల్లో కాలుష్యానికి ఏమాత్రం తావు లేదు. భగవంతుడు ప్రకృతి స్వరూపుడు. ఆయనను పర్యావరణానికి చెడు చేసే కృత్రిమ పదార్థాలతో రూపొందించడం, పూజించడం ద్రోహం. అందుకే విగ్రహాల పరిమాణాలతో, రంగుహంగులతో మనం పోటీపడవద్దు. సహజమైన మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం.

Click Here For September 2024 Bhakthi Magazine Online Edition

దక్షిణాయనంలో వచ్చే తొలి పండుగ వినాయక చవితి. అంతకుముందు వచ్చిన ఆషాఢ, శ్రవణాలు వర్ణాలతో…. వరలక్ష్మీ వ్రతాలతో గడిచిపోతుంది. భాద్రపదమాసంలో వినాయక చవితితోనే మన పండుగలు మొదలవుతాయి. ఈ మాసంలో వచ్చే బహుళ పక్షాన్ని (సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు) మహాలయ పక్షం అని పిలుస్తారు. ఆ సమయంలో పితృదేవతలను ఆరాధిస్తుంటారు. గతించిన పెద్దలందరికీ పిండప్రదానాలు, తర్పణాలు తప్పక చేస్తుంటారు. ఈ భాద్రపదంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలుండవు. వివిధ ఆలయాల్లో ఉత్సవాలు, జాతరలు జరుగుతుంటాయి. ఈ మాసం భక్తిపత్రికలో అందరూ ఇంటిలో స్వయంగా ఆచరించుకునేందుకు వీలుగా రూపొందించిన వినాయక పూజావిధానాన్ని అందిస్తున్నాం. భక్తిపత్రిక సాయంతో మీరంతా ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిస్తున్నాం.

ఇలా అనేక అంశాలతో సెప్టెంబర్ ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది. కొన్న వారికి తక్షణమే తమ DASHBOARD లోకి పత్రిక వచ్చేస్తుంది. అందులోని పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.

ఇక్కడ క్లిక్ చేయండి.. సెప్టెంబర్ ఆన్లైన్ భక్తి పత్రికను పొందండి..!

Share this post with your friends