శివుడికి కపాలీశ్వరుడనే పేరు ఎందుకు వచ్చిందంటే..

చెన్నైలోని మైలాపూర్‌లో అరుల్మిగు కపాలీశ్వర స్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ పార్వతీదేవి నెమలి రూపంలో తపస్సు చేసిందట. అయితే ఈ ఆలయ స్థలపురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని గురించి తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ దేవుడు కైలాసంలో శివుడిని దర్శించుకున్నాడు. ఆ తరువాతి నుంచి గర్వాన్ని ప్రదర్శించాడంట! విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు.. బ్రహ్మ గర్వాన్ని అణచడానికి ఆయన శిరస్సులలో ఒకదానిని ఖండించాడట. ఆ తరువాత శివుడు బ్రహ్మ కపాలాన్ని చేత ధరించాడని చెబుతారు.

శివుడు బ్రహ్మ కపాలాన్ని ధరించిన కారణంగానే ఆయన కపాలీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. అనంతరం బ్రహ్మ కూడా తన పాపపరిహారం కోసం మైలాపూర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేశాడట. దీంతో ఆయనకు పాప పరిహారం లభించిందట. పూర్వం సుబ్రహ్మణ్యస్వామి రాక్షస సంహారానికి కావలసిన శక్తుల కోసం ఇక్కడే తపస్సు చేశాడని చెబుతారు. అప్పుడు పార్వతి పరమేశ్వరులు తమ కుమారుడిని అనుగ్రహించి ‘వేలాయుధం’ అనే ఆయుధాన్ని ఇచ్చారట. ఇదంతా జరిగింది ఇక్కడేనని చెబుతారు. ఈ విషయాన్ని శివపురాణంలో వివరించడం జరిగింది.

Share this post with your friends