ఈ శివాలయ నిర్మాణమే ఒక అద్భుతం..

కాకతీయుల రాజైన గణపతి దేవునికి శివుడంటే అపారమైన భక్తి. స్వామివారి కృపతోనే యుద్ధాలలో తనకి అనేక విజయాలను సాధించానని భావించేవాడు. ఆ భక్తితోనే గణపతిదేవుడు.. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని శివాలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. గణపతిదేవుడి కాలంలో ఈ శివాలయంలోని శివుడు.. రామలింగేశ్వరస్వామిగా పూజలందుకునేవాడు. గణపతిదేవుడు తరువాతి కాలంలో శివయ్య పేరును కూడా కలుపుకుని ‘గణపేశ్వర స్వామి’గా ప్రసిద్ధి గాంచాడని చెబుతారు. గణపేశ్వరాలయం కూసుమంచి బస్టాండ్ నుండి 1.7 కి.మీ దూరంలో ఉంది. కాకతీయులు ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఈ శివాలయ నిర్మాణమే ఒక అద్భుతం..
ఈ శివాలయ నిర్మాణమే ఒక అద్భుతం..

ఈ ఆలయంలో మనకు కనిపించే కాకతీయుల శిల్ప రీతి.. అత్యంత ప్రాచీనమైనదిగానే కాకుండా అత్యంత విశిష్టమైనదిగా చెబుతారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయ నిర్మాణానికి సిమెంట్, సున్నం వంటివి ఏమీ వాడలేదు. కేవలం రాళ్లను అనుసంధానం చేసి ఇంటర్ లాకింగ్ విధానంలో నిర్మించడం జరిగింది. అంటే పెద్ద పెద్ద రాళ్లను గాడులూ, కూసాల పద్ధతిలో బిగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కాకతీయుల కళావైభవానికి నిదర్శనం. రాతి పలకలను ఒకదానిపై మరొకటి వరుసగా పేరుస్తూ ఆలయాన్ని నిర్మించినట్టుగానే ఆలయంలోని స్తంభాలను సైతం ఒకదానిపై మరొకటి నిలుపుతూ నిర్మాణం గావించారు.

Share this post with your friends