వినాయక చవితిని రేపు జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమైంది. అన్ని చోట్ల ఇప్పటికే మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను తీసుకొచ్చి పెట్టేశారు. పది రోజుల పాటు గణపతిని పూజించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారు. ఈ రోజున విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఏడాది పొడవునా కష్టాలుండని నమ్మకం. వినాయక చవితి రోజున గణపతి పూజ చేసే సమయంలో ఒక పని చేస్తే ఇక మనకు తిరుగుండదట. అదేంటంటే.. గణపతి పూజ చేసే సమయంలో తెల్ల కాగితం మీద ప్రత్యేకమైన అంకెలు రాసి, ఆ కాగితాన్ని పర్సులో పెట్టుకోవాలట. ఆ అంకెలేంటో తెలుసుకుందాం.
ముందుగా వినాయకుడి దగ్గర దీపారాధన చేసిన తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకుని దానికి కుంకుమ బొట్లు, గంధం బొట్టు పెట్టాలి. ఆ కాగితంలో చతురస్రాకారంలో పెన్నుతో బాక్స్ గీసి దానిలో అడ్డం 4 బాక్సులు, నిలువు 4 బాక్సులు వచ్చేలా మొత్తంగా 16 గడులు వచ్చేలాగా గీయాలి. మొదటి అడ్డ బాక్సులలో.. 15, 10, 8, 6 నంబర్లు.. రెండో వరసలో.. 4, 6, 16, 9 నంబర్లు.. మూడో వరసలో.. 14, 11, 2, 7.. నాలుగో వరుసలో 1, 8, 13, 12 నంబర్లు రాయాలి. రాశాక కాగితాన్ని పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత తీసి బీరువాలో పెట్టుకోవాలి. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దీనిని మీ పర్సులో పెట్టుకుని వెళితే ఎలాంటి ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయట.