శివుడి శాపంతో నెమలిగా మారిన పార్వతీదేవి.. ఆ తర్వాతేం జరిగిందంటే..

మైలాపూర్ క్షేత్ర స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పార్వతీపరమేశ్వరులకు సంబంధించిన కథ ఇది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతికి పంచాక్షరీ మంత్రాన్ని బోధిస్తున్నాడట. ఆ సమయంలో ఆమె దృష్టి అక్కడ ఉన్న నెమలిపై పడటంతో పార్వతి శ్రద్ధ లేకుండా దానిని చూడటంలో నిమగ్నమైంది. అది గమనించిన శివుడు ఆగ్రహంతో పార్వతీదేవిని నెమిలిగా మారిపొమ్మని శపించాడు. పార్వతి పశ్చాత్తాపంతో శాప విమోచనం కోరగా.. నెమలిగా భూలోకంలో తన కోసం తపస్సు చేస్తే విముక్తి లభిస్తుందని చెప్పాడు.

అప్పటి నుంచి పార్వతీదేవి భూలోకంలో ఒక చెట్టు కింద నెమలి రూపంలో శివుడి కోసం తపస్సు చేస్తుండగా.. ఆమెకు శాప విముక్తి కలిగిందట. శివుడు ప్రత్యక్షమై అక్కడే తన చెంత కర్పగవల్లిగా ఉండమని దీవించాడు. ఇదంతా జరిగింది చెన్నై నడిబొడ్డున ఉన్న మైలాపూర్ ప్రాంతంలోనేనని చెబుతారు. అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరులు అక్కడే కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అందుకే మైలాపూర్ భూలోక కైలాసంగా మారింది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి రాక్షస సంహారానికి కావల్సిన శక్తుల కోసం ఇక్కడే తపస్సు చేసి వేలాయుధం సంపాదించుకున్నది కూడా ఇక్కడేనని చెబుతారు.

Share this post with your friends