మహర్నవమిని ఏ ఏ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారు?

నవరాత్రుల తొమ్మిదవ రోజు మహర్నవమి. ఈ రోజున అమ్మవారు దుర్గ, చండీ, సరస్వతి రూపాల్లో ప్రత్యేకంగా ఆరాధించబడతారు. ఇది శక్తి సంపూర్ణతకు సంకేతం. ఇళ్లల్లో చేసే ఆచారాలేంటంటే..
దేవీ మహాత్మ్యం పారాయణం

సరస్వతీ పూజ – పుస్తకాలు, వాయిద్యాలు, విద్యాసాధనాల పూజ

కన్యాపూజ – చిన్నారులను దేవీ రూపంగా పూజించి అన్నదానం చేయడం

అన్నదానం – భక్తికి మూలం

ఈ రోజున దేశ వ్యాప్తంగా ఆయుధపూజ, వాహనపూజ విస్తృతంగా జరుగుతుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ దుర్గాష్టమి రోజున శోభాయమానంగా ముగుస్తుంది. నవమి దశములలో దుర్గా ఆరాధన కొనసాగుతుంది. తమిళనాడులో ఆయుధపూజ, సరస్వతీ పూజ.. విద్యార్థులు, కార్మికులు, రైతులు తమ సాధనాలను పూజించి విజయదశమికి సిద్ధమవుతారు. కర్ణాటకలో మైసూరు దసరా – నవమి నాడు రాజప్రాసాదంలో రాజఖడ్గ పూజ, శక్తి ఆరాధనతో జంబూసవారి ఏర్పాట్లు. కేరళలో సరస్వతీ పూజ – పుస్తకాలు, సంగీత వాయిద్యాలను అలంకరించి పూజిస్తారు. విజయదశమి నాడు విద్యారంభం సంప్రదాయం ఉంది. పశ్చిమ బెంగాల్ & ఈశాన్య రాష్ట్రాల్లో దుర్గాపూజ మహోత్సవం – నవమి నాడు మహా హోమం, సంధి పూజ విశేషంగా చేస్తారు. 108 దీపాలతో చేసే సంధి పూజ అత్యంత శక్తివంతమైనది. ఒడిశాలో చండీ దేవాలయాలు – నవమి నాడు చండీ పఠం, విశేష హోమాలు నిర్వహిస్తారు. నేపాల్‌లో దసైన్ మహానవమి – సైన్యంలోని ఆయుధాలకు పూజలు, సంప్రదాయ బలిప్రథలు.

మహర్నవమి నైవేద్యాలు

పాయసం, పులిహోర, పండ్లు, ఖిచిడీ, గూఢాన్నం వంటి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు.

Share this post with your friends