కలలో పులి కనిపిస్తే సంకేతమేంటంటే..

పులిని చూస్తే ఎవరైనా భయపడతారు. జూలో ఒక ఫెన్సింగ్ నడుమ చూస్తాం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. అయితే పులి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని స్వప్న శాస్త్రం చెబుతోంది. పులి నేరుగానే కాదు.. కలలో కనిపించినా ఇబ్బందేనదట. అసలు పులి మనకు కలలో కనిపించడం దేనికి సంకేతమో తెలుసుకుందాం. కలలో పులి కనిపించడం అనేది మనల్ని జీవితంలో కొన్ని సమస్యలు వేధిస్తున్న దానికి సూచనగా పేర్కొంటారు. కలలో పులి కనిపిస్తే ఒక అడుగు వెనక్కు వేయడమో లేదంటే కాసేపు విశ్రాంతి అనంతరం పని మొదలు పెట్టాలని సంకేతం అయి ఉండవచ్చట. లేదంటే సమస్యలను పరిష్కరించడానికి శక్తికి సంకేతంగా భావించవచ్చు.

పులులు స్వేచ్ఛ , ఏకాంతానికి చిహ్నాలుగా నమ్ముతారు కాబట్టి మనతో మనం సమయం గడిపేందుకు, మనల్ని మనం రీచార్జ్ చేసుకునేందుకు సైతం సంకేతం కావొచ్చని చెబుతారు. కలలో పులి కనిపించిందంటే.. కంటికి కనిపించని శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని కూడా అర్థమట. అలాగే తెల్ల పులి కలలో కనిపించడమనేది ఆధ్యాత్మికతకు సంకేతంగా కూడా చెబుతారు. ఒకవేళ పులి వెంబడించినట్టు కల వస్తే.. కెరీర్, సంబంధాలు లేదా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హెచ్చరిక కూడా కావచ్చని స్వప్న శాస్తం చెబుతోంది. అలాగే పులి దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెడుతున్నట్టుగా కల వస్తే మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్టుగా అర్థమట. నిద్రపోతున్న పులి కలలో కనిపిస్తే అణచివేతకు గురైన ప్రతిభకు సంకేతమట. పులి పంజా విసురుతున్నట్టు కల వస్తే మీ స్నేహితులు, సన్నిహితులు, సహోద్యోగుల్లో మోసం చేసేవారున్నారని అర్థమట.

Share this post with your friends