వెల్లిశ్వరర్ ఆలయ విశేషాలు.. ఎవరెవరు కొలువుదీరారంటే..

చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న వెల్లిశ్వరర్ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయానికి వస్తే కంటి సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పుకున్నాం. అయితే ఈ ఆలయానికి వచ్చిన వారు తప్పకుండా నెయ్యితో దీపాలు వెలిగించి వెల్లిశ్వరర్‌కి పువ్వులు సమర్పిస్తారు. ఈ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలట. అప్పుడు శివయ్య వారి భక్తి శ్రద్దలకు మెచ్చి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాడట. ఈ ఆలయంలో వెల్లిశ్వరర్‌తో పాటు ఆయన భార్య కామకాశి అమ్మన్ పూజించబడతారు.

ఈ ఆలయాన్ని శక్తి స్థలంగా పేర్కొంటారు. దీనికి కారణంగా ఈ ఆలయంలో నవగ్రహాల్లో ఒకటైన శుక్రగ్రహంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇక్కడకు శుక్ర గ్రహం కారణంగా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేవారు వస్తారు. ఈ ఆలయంలో ప్రేమ, సంబంధాలు, అందం, సృజనాత్మకత, సంపదకు సంబంధించిన శుక్ర గ్రహ ప్రతికూల గ్రహ ప్రభావాల నుంచి ఉపశమనం పొందేందుకు భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం సంప్రదాయ ద్రవిడ శైలి నిర్మాణంతో పాటు అద్భుతమైన శిల్పాలు, ప్రముఖ గేట్‌ వేను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఆలయంలో వెల్లిశ్వరర్, కామకాశి అమ్మన్ మాత్రమే కాకుండా గణేశుడు, మురుగన్, నవగ్రహాలు కొలువుదీరాయి.

Share this post with your friends