వయోవృద్ధులను ఆఫ్‌లైన్‌ దర్శనంపై ఈవో ఏమన్నారంటే..

సామాన్య భ‌క్తుల సౌక‌ర్యార్థం వైకుఠ ఏకాద‌శికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు. దీనికోసం తిరుప‌తి, తిరుమ‌లలో 91 కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఓ భక్తుడు.. ‘తిరుమ‌ల‌లో వయోవృద్ధులకు పాత పద్ధతిలో ఆధార్ కార్డుతో శ్రీవారి దర్శనం కల్పించండి’ అని కోరగా ఈవో అలా కుదరదని సమాధానమిచ్చారు.

‘ఆన్ లైన్లోనే వయోవృద్ధులు, దివ్యాంగులు శ్రీ‌వారి దర్శనం టికెట్లు పొందాలని, ఆఫ్ లైన్ లో దర్శనానికి అనుమతించడం వీలు కాదు’ అని ఈవో స్పష్టం చేశారు. అలాగే మరో భక్తుడు ’కరోనా సమయం నుండి ఎస్వీబీసీ లో భారతం, భాగవతం, రామాయణం వంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఇటీవల కాలంలో నిలిపివేశారు. వీటిని తిరిగి ప్రసారం చేయండి’ అని కోరారు. దీనికి పరిశీలిస్తామని ఈవో తెలిపారు. అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆఫ్‌లైన్‌లో జారీ చేయమని ఓ భక్తుడు కోరగా.. కుదరదని ఈవో శ్యామలరావు తేల్చేశారు.

Share this post with your friends